22 April, 2026 | 1:01 PM

Breaking News

ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •  

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలి

07-10-2025 12:00 AM

దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ 

దేవరకొండ, అక్టోబర్ 6  (విజయక్రాంతి): దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే బాలునాయక్ నివాసంలో సోమవారం దేవరకొండ, నేరేడుగొమ్ము, చందంపేట, డిండి, కొండమల్లేపల్లి మండలాల ముఖ్య నాయకులతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ స్థానిక ఎన్నికల కోసం సమీక్ష సమావే శన్నీ నిర్వహించారు. అనంతరం వారుమాట్లాడుతూ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పని చేయాలి అని అన్నారు.

రిజర్వేషన్లపై అపోహాలు నమ్మొద్దు పార్టీ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలి అని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త, పాత తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు, బలోపేతం చేసిన వారికి అవకాశాలు ఉంటాయని వారు అన్నారు. కార్యక్రమంలో నియోజక వర్గ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.