కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ
తుంగతుర్తి, ఆగస్టు 9 : కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు అన్నారు. తుంగతుర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఓరుగంటి దయాకర్ గుప్తా ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబానికి ఏఐసీసీ మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సహకారంతో తుంగతుర్తి గ్రామపంచాయతీ రెండవ వార్డు సభ్యులు ఎల్లబోయిన శ్రీకాంత్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం 50 కేజీల బియ్యంను వారి కుటుంబానికి అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే కార్యకర్తలకు భరోసా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ సర్పంచ్ అభ్యర్థి బొంకురి సుదర్శన్, మండల కాంగ్రెస్ , నాయకులు దేవాలయ డైరెక్టర్ గునగంటి రమేష్ మాజీ డైరెక్టర్ బత్తుల జలెంధర్, తదితరులు పాల్గొన్నారు.






