5 May, 2026 | 2:01 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి

04-03-2026 05:07 PM

మంథని బిజెపి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బోయిని నారాయణ డిమాండ్

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు లోని శ్రీరామ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని బిజెపి పార్టీ మంథని మాజీ మండల అధ్యక్షుడు బోయిని నారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులను బుధవారం రామాలయం వద్ద విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ లోని  రామాలయం లో ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.

కానీ సీతరాములు మహోత్సవం కార్యక్రమానికి ఆలయం వద్ద స్థాలం సరిపోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎస్ఆర్ఎస్పి కాలువ పైన సిమెంట్ తో ఫ్లోరింగ్ పనులు చేయిస్తామని  మున్సిపల్ ఎన్నికల ముందు శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలకు  కాంగ్రెస్ పార్టీ నాయకులు హామి ఇచ్చారని, హామిని వెంటనే నిలబెట్టుకోవాలని శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలందరి తరఫున కోరుతున్నానని నారాయణ అన్నారు.

త్వరలోనే  శ్రీరామనవమి  కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంథని మున్సిపల్ పరిధిలోనే అత్యంత అంగరంగ వైభవంగా ఎక్కడ లేని విధంగా జరుపుకుంటారని, భక్తుల సౌకర్యార్థం శ్రీరామనవమిని పురస్కరించుకొని, వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని  నారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు.