14-02-2026 01:36:25 AM
అలంపూర్ ఫిబ్రవరి 13: టికెట్ ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఈ మోసానికి ప్రజ లే గుణపాఠం చెప్పారని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మూడవ వార్డు బరిలో నిలిచి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థి అసిఫ్ ఖాన్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం గెలుపొందిన సందర్భంగా ఆయ న మాట్లాడారు.అలంపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటూ ప్రజలకు పలు రకాల సేవలందించిన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ దక్కకుండా మోసం చేసిందని మండిపడ్డారు.
దీంతో ఆ పార్టీని వీడి ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ చల్లా సహకారంతో మూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీలో నిలిచినట్లు తెలిపారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.