1 May, 2026 | 9:39 PM

సీపీఐ ఆధ్వర్యంలోఘనంగా మేడే వేడుకలు

01-05-2026 08:35 PM

ఆళ్ళపల్లి,(జయక్రాంతి): వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని వర్కోడు గ్రామంలో మండల కార్యదర్శి కొమరం హనుమంతు అధ్యక్షతన జరిగిన జండా ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. మండల కేంద్రంలో భగత్ సింగ్ స్తూపం వద్ద వేడుకలలో రేసు ఎల్లయ్య మాట్లాడుతూ...1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని ఆయన తెలిపారు.

కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ 1886, మే1న చాలామంది కార్మికులు పోరాటం చేపట్టారని దానికి మద్దతుగా నాలుగు రోజుల తరవాత షికాగోలోని హే మార్కెట్‌లో చాలామంది ప్రదర్శన నిర్వహించారని, కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారని  రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ అన్నారు. షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకుంటమని తెలిపారు.