9 August, 2026 | 3:26 PM

పెద్ది స్వగ్రామం నల్లబెల్లికి కేసీఆర్

09-08-2026 02:10 PM

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లికి బయల్దేరారు.పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇవ్వనున్నారు. సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రూ. 2.25 కోట్ల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు పార్టీ నేతలు పయనం అయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కేసీఆర్ నల్లబెల్లికి వెళ్తుండగా అభిమానులు ఎదురొచ్చారు. దీంతో తన కారు నుంచి కిందకు దిగి అభిమానుల్ని పలకరించారు. అనంతరం అక్కడి నుంచి నల్లబెల్లికి కేసీఆర్ పయనం అయ్యారు. BRS నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి జూలై 31, 2026 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.