26 July, 2026 | 4:48 AM

ఎరుకలపై కాంగ్రెస్ చిన్నచూపు

26-07-2026 01:01 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ఎరుకల కులస్తుల సమగ్ర అభివృద్ధి కోసం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత వారిపట్ల చిన్నచూపు, వివక్ష ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌లో స్పందిస్తూ ఆరోపించారు. రూ.60 కోట్లతో ఎరుకల ఎంపవర్‌మెంట్ స్కీమ్‌ను ఏర్పాటు చేయడంతోపాటు, ఎరుకల జాతి ఆరాధ్య దైవం నాంచారమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారని అన్నారు.

హైదరాబాద్ నగరంలోని నిజాంపే టలో ఎకరం విస్తీర్ణంలో రూ.5 కోట్ల వ్యయంతో ఎరుకల ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఈ భవనాన్ని ఇప్పటికీ ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏకలవ్య జయంతి సందర్భంగా హరీశ్‌రావు శుభాకాం క్షలు తెలిపారు. అచంచలమైన గురుభక్తికి, అద్వితీయమైన పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం ఏకలవ్యుడు అని కొనియాడారు.