6 May, 2026 | 7:31 PM

డిఎస్పిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

06-05-2026 06:37 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఇటీవల డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్ , మార్కెట్ కమిటీ చైర్మన్  ఇరకుల్లా మంగ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన డిఎస్పి కి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాపర్తి కార్తీక్, వార్డు సభ్యులు గులాం జావిద్, NSUI జిల్లా అధ్యక్షులు ఎండి ఆసిఫ్ అలీ,టౌన్ ప్రెసిడెంట్ రఫిక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్లా, తాజ్, జాలింషా, సాయి బండి సాయి శేఖర్ NSUI నియోజకవర్గ అధ్యక్షుడు జమీర్ తదితరులు పాల్గొన్నారు.