ఈవీఎం గోడౌన్ ను పరిశీలన
06-05-2026 06:40 PM
గద్వాల టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్ ను ఈవీఎంల నెలవారి సాధారణ తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. సందర్శనలో భాగంగా తనిఖీ రిజిస్టర్ లో కలెక్టర్ సంతకాలు చేశారు. ఈ తనిఖీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు మంజుల, సంబంధిత ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






