15 June, 2026 | 2:35 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

అడవి శ్రీరాంపూర్‌లో సమ్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు

13-06-2026 04:06 PM

ముత్తారం,(విజయక్రాంతి): అడవి శ్రీరాంపూర్ తాజా మాజీ ఎంపీటీసీ దొడ్డ గీతా రాణి సోదరుడు, ఎలిమిళ్ళ సమ్మయ్య  ఇటీవల హుజురాబాద్‌లో అనారోగ్యంతో మరణించారు. ఈ విషాదకర వార్త తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయాల్సిందిగా స్థానిక నాయకులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు, అడవి శ్రీరాంపూర్ సర్పంచ్ కొట్టే ఉపేందర్ - అన్నపూర్ణ దంపతులు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మయ్య  నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్టకాలంలో వారికి ధైర్యం చెప్పి, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.