మహిళా సాధికారతకు కాంగ్రెస్సే అడ్డంకి..
ఏప్రిల్ 17 దేశ చరిత్రలో చీకటి రోజు
మహిళా లోకం క్షమించదు
బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి
జడ్చర్ల : మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న తీరు దేశంమంతా చూసిందని, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డు పెడుతుందని బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీ రెడ్డి విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు పై కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరును ఆమె ఒక ప్రకటనలో ఎండగట్టారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుకట్టు వేసిన కాంగ్రెస్ పార్టీకి మహిళా లోకం ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. మహిళా సాధికారత దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బిల్లుకు మద్దతు తెలిపాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తన వక్రబుద్ధి చూపిస్తూ తమ మిత్రపక్షంతో కలిసి బిల్లును నీరు కార్చడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సభలో విమర్శలు చేస్తూ గందరగోళానికి గురిచేస్తూ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తీరును మహిళా లోకం క్షమించదని ద్వజమెత్తారు. దేశ చరిత్రలోనే ఏప్రిల్ 17 ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందితే.. ప్రధాని నరేంద్ర మోదీ గారికి,ఎన్డీయే కి మరింత పేరు వస్తుందని వ్యతిరేకించడం సమంజసం కాదన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల భాగస్వామ్యం కీలకమని గుర్తిస్తూ సదుద్దేశంతో ఈ బిల్లును తీసుకువచ్చిన నేపథ్యంలో బిల్లును వీగిపోయేలా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బిజెపి అధిష్టానం నిర్ణయం మేరకు మున్ముందు కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.






