12-02-2026 02:11:27 AM
ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా అధికార పార్టీ నడుచుకోవడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జరుగుచున్న కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా శ్రీనివాస కాలనీలోని గీతం పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు డబ్బులు పెద్దమొత్తంలో పంచారని, ప్రతి నియోజక వర్గానికి నిధులు వచ్చాయన్నారు. పోలీస్ లు దగ్గర ఉండి పంపిణి చేయించారని, పోలీస్ అధికారులు పకడ్బందీగా పనిచేసేవారన్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి కనిపిస్తుందని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను మాత్రం వేధింపులకు గురిచేశారని, అధికార దుర్వినియోగానికి పాలపడుతున్న ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా సరిగ్గా చేయలేదని,
బీ ఆర్ ఎస్ పార్టీ ని ఎదుర్కోవడానికి బీజేపీ..కాంగ్రెస్ తో పాటు ఇతర అభ్యర్థులు ఏకమై బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించాలని అనుకుంటున్నారన్నారు. జాతీయ పార్టీలు ప్రజలు చూడటానికి కొట్లాడుకొని కింద స్థాయిలో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ లేదని, ఉనికి లేదని మాట్లాడిన నాయకులు ఎందుకు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను చూసి ఎందుకు భయపడుతున్నారన్నారు. ఒంటరిగా ఎన్నికల్లో నిలబడ్డాం సగానికి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటమన్నారు.