calender_icon.png 20 February, 2026 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

20-02-2026 02:33:52 PM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల(BC reservations) అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) ఆరోపించారు. నగరంలోని ట్యాంక్ బండ్ పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు పనులను కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ...  రెండున్నరేళ్లుగా పూలే విగ్రహాం ఏర్పాటు కోసం జాగృతి పోరాటం చేస్తోందని తెలిపారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాం ఏర్పాటు చేయటం పాక్షిక విజయమే అన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో(Telangana Assembly) కూడా పూలే విగ్రహాం ఉండాలన్నది తమ డిమాండ్ అన్నారు. బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహాం తెలంగాణ తల్లి కాదన్నారు. వాళ్లు పెట్టే కాంగ్రెస్ బొమ్మకు ప్రజల ఆమోదం లభించదని చెప్పారు. బలవంతంగా ఒక ప్రతీకను ప్రజల మీద రుద్దే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. అధికారం ఉందని వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) 42 శాతం రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.