పలిమేల పోలిస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
22-07-2026 04:29 PM
పలిమేల,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో కేసుల దర్యాప్తు పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. నిఘా నేత్రాల పనితీరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల పరిశుభ్రతను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... కేసులో దర్యాప్తును వేగవంతంగా చేపట్టాలని స్టేషన్ కు వచ్చే ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నేరాల నియంత్రణను సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విదంగా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.ఎస్సై సాయి శశాంక్, పోలీస్ సిబ్బంది వున్నారు.






