22 July, 2026 | 5:12 PM

లక్ష్మి బ్యారేజ్ కు భారీగా వరద ప్రవాహం

22-07-2026 04:25 PM

మహాదేవపూర్,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ (లక్ష్మి బ్యారేజ్ )కి భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది క్రమేపి పెరుగుతుంది. బుధవారం లక్ష్మి బ్యారేజ్ 16.17టి ఎం సి ల సమర్థ్యనికి బ్యారేజ్ లోకి 16 వేల 620 క్యూసెక్కుల నీటి ప్రవాహం రాగ బ్యారేజ్ 85గేట్లు ఎత్తి అదే లెవల్లో దిగువకు విడుదల చేస్తున్నారు.