05-02-2026 01:26:51 AM
* మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): మెదక్ మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ ప్రచా రం జోరందుకుంది. బుధవారం మెదక్ మున్సిపల్ పరిధిలోని 1,2,3,4, వార్డుల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులకు ఎరువులు సకాలంలో అందజేస్తూ ఇబ్బందులు లేకుండా చూసారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని విమర్శించారు. వార్డులలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి,మాజీ కౌన్సిలర్లు కొట్టాల. విశ్వం,భీమారి. కిషోర్,వార్డ్ ఇంచార్జిలు హవేళిఘనాపూర్ సర్పంచ్ మ్యాకల సాయిలు, ఉప సర్పంచ్ వడ్ల రాజు, వార్డు ఇంచార్జ్లుసుదర్శన్, రవీందర్, మోహన్ నాయక్, నాగరాజు, రామచంద్ర రెడ్డి శ్రీహరి, పట్టణ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.