23 April, 2026 | 5:33 PM

కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి

23-04-2026 04:03 PM

హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి చెంపపెట్టు

హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక చెల్లలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి చెంపపెట్టు అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీకి ప్రభుత్వం హామీలిచ్చి మభ్యపెట్టిందన్న కిషన్ రెడ్డి అందుకే సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఆర్టీసీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా లేకపోవడంతో ప్రజలు ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్లకు క్యూ కడుతున్నారు.