27 February, 2026 | 11:21 PM

Breaking News

నూతన సర్పంచులకు శిక్షణ కార్యక్రమం నిర్వహణ

27-02-2026 09:23 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికల్పేట్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు  కాఘజనగర్ మైనారిటీ భవనములో ఈ నెల 22-02-26 నుండి 27-02-26 వరకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు పాల్గొన్నారు.

శిక్షణలో భాగంగా గ్రామ పంచాయతీ పరిపాలన, గ్రామాభివృద్ధి పనుల అమలు, నిధుల వినియోగం, ప్రభుత్వ పథకాల నిర్వహణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారులచే సమగ్ర అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలనతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమములో నూతన సర్పంచులు మరియు అధికారులు  పాల్గొన్నారు.