9 May, 2026 | 1:10 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

మహిళా సంక్షేమంపై సమగ్ర కార్యాచరణ

03-03-2026 01:33 AM
  1. వ్యవస్థాపరమైన లోపాలను అధిగమించాలి

వివిధ శాఖల అధికారుల సమీక్షలో మంత్రి సీతక్క

హైదరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): మహిళా భద్రత, సాధికారత కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క సూచించారు. మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం సచివాలయంలో మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం అవలంబించాల్సిన నూతన విధానాలపై పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహిళా భద్రతను మరింత సమగ్రంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పలు అంశాలపై చర్చించారు. సమావేశానికి ఉన్నతా ధికారులు సంజయ్ కుమార్, శికా గోయల్, క్రిస్టినా చోంగ్తు, అనితా రామచంద్రన్, ప్రియాంకా వర్గీస్, శృతి ఓజా, దివ్యా దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు హాజర య్యారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, రాత్రి వేళల ప్రయాణాలు, డిజిటల్ వేదికలు, అసంఘటిత రంగం వంటి విభిన్న రంగాల్లో ఇంకా వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని సమావేశం అభి ప్రాయపడింది. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సంద ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... మహిళల రక్షణ కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో, కంపెనీల్లో ఐసీసీ కమిటీలకు తప్పనిసరి ఆడిట్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలని సూచించారు. ఆశ్రయ గృహాలు, హాస్టళ్ల భద్రతపై డిజిటల్ పర్యవేక్షణ ప్రోటోకాల్ అమలు చేయాలని ఆదేశించారు.