ప్రతి గ్రామంలో డ్వాక్రా భవనాల నిర్మాణం పూర్తి చేయండి: ఎంపీడీవో
18-06-2026 02:49 PM
బోథ్ జూన్ 18( విజయక్రాంతి): మండలంలో 38 డ్వాక్రా భవనాలు మంజీర అయ్యాయని అయితే భవనాలను సత్వరమే నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవో ఎల్ రమేష్ కోరారు. ఇప్పటికీ మండలంలోని నాగపూర్ కుచ్లాపూర్ కనుగుట్ట గ్రామాలలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మిగతా గ్రామాల వారు సత్వరమే నిర్మాణం చేపట్టాలని సూచించారు. డ్వాక్రా భవనాల నిర్మాణం జరిగితే సకాలంలో నిధులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గ్రామాల సర్పంచులు ఈ విషయంలో శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు.






