11 July, 2026 | 8:17 PM

Breaking News

శాతవాహన క్రీడా మైదానంలో 'సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్' నిర్మాణానికి భూమి పూజ   •   ఈనెల 13న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన   •   మొదటి వేతనంతో పాఠశాలకు సౌండ్ సిస్టం అందించిన సర్పంచ్   •   లింగాపూర్ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   మత్తు పదార్థాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   బాన్సువాడ జామ మసీద్ నూతన అధ్యక్షునికి ఘన సన్మానం   •   బెజ్జంకిలో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   ఎస్‌ఐఆర్–2026ను పారదర్శకంగా నిర్వహించాలి   •   ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించటం గర్వకారణం   •   రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ఆధ్వర్యంలో నోట్‌ బుక్స్ పంపిణీ   •  

కలెక్టర్ ప్రజావాణికి 106 ఫిర్యాదులు

17-11-2025 08:12 PM

గద్వాల: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, హౌసింగ్ పిడి శ్రీనివాసరావు లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.