25 August, 2026 | 3:39 AM

ప్రజావాణికి 53 ఫిర్యాదులు

25-08-2026 12:00 AM

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 53 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కిరణ్మయి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తో కలిసి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పు డు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అ ధికారులను ఆదేశించారు.

రెవెన్యూ శాఖ26, ఇతర శాఖలు 27, మొత్తం 53 దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో  జిల్లా రెవె న్యూ అధికారి శారదా దేవి వివిధ శాఖల జి ల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెం ట్లు,  సంబంధిత   అధికారులు తదితరులు పాల్గొన్నారు.