14 July, 2026 | 5:28 AM

సీఎంసీ ప్రజావాణికి 66 ఫిర్యాదులు

14-07-2026 12:03 AM

అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి 51 వినతులు

శేరిలింగంపల్లి,జులై 13 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పౌరులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా పౌరుల నుంచి మొత్తం 66 ఫిర్యాదులు అందాయి.వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 51, ఇంజనీరింగ్ విభాగానికి 8,శానిటెషన్ 2,అర్బన్ బయోడైవర్సిటీకి 2,ఎలక్ట్రికల్, రెవెన్యూ (ప్రాపర్టీ ట్యాక్స్),

ఎన్నికల విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందాయి.కమిషనర్ శ్రీజన్ మాట్లాడుతూ, అందిన అన్ని ఫిర్యాదులకు ప్రత్యేక ఐడీలు కేటాయించి, పారదర్శకంగా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చి, వారి ఫిర్యాదులపై నిరంతరం కృషి చేయాలని సూచించారు.