18 April, 2026 | 1:04 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

గీత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి

18-12-2025 06:34 PM

నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూర్ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు సున్నపు సైదులు మృతిచెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ కొవ్వాకుల రాంబాబు, ఉపసర్పంచ్ నీలం సాయిలు, కల్లు గీత సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుడుగుంట్ల బుచ్చిరాములు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు గౌడ సంఘం మండల కోశాధికారి నీలం అంజయ్య, అనంతుల ప్రభాకర్, నీలం వెంకటేశ్వర్లు, చెవుగోని సాయిలు,అనంతల జానయ్య, కుక్కడపు రవి తదితరులు పాల్గొన్నారు.