4 May, 2026 | 3:35 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

మొక్కజొన్న పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 50,000 పరిహారంగా ఇవ్వాలి

04-05-2026 02:12 PM

బోథ్,(విజయక్రాంతి): అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంటను కోల్పోయిన కనుగుట్ట గ్రామ రైతాంగానికి ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారంగా అందించాలని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కనుగుట్ట గ్రామంలో కాలిపోయిన జొన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ సహాయం కింద ₹20,000 ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలను సకాలంలో కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదన్నారు.

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ తీగలు తగిలి ఈ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఏ ఈ తన తీరును మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కనుగుట్ట విడిసి అధ్యక్షులు రవి గంగ మల్లు మాజీ ఉపసర్పంచ్ రమేష్ నవరాజు బోత్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ మండల కార్యదర్శి ఎలుక రాజు బోత్ వి డీసీ అధ్యక్షులు అల్లకొండ పోతన్న మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ సర్పంచ్ రవీందర్ నంద పొగడ సర్పంచ్ బాబు లాల్ అవుట్ ఆఫ్ ది ఉపసర్పంచ్ రమణ సాగర్ రెడ్డి రైతులు ఉన్నారు