calender_icon.png 24 February, 2026 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ క్రీడాకారులను అభినందనలతో ముంచెత్తిన కమిషనర్

24-02-2026 12:00:00 AM

వరంగల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి పోలీసు గేమ్స్ అండ్ స్పోరట్స్ లో ప్రతిభ చాటి బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన పోలీస్ లను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రశంసించారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు.

ఈ కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమములో డిసిపిలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఎస్పీ మనిషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్ కుమార్, రవి,శ్రీనివాస్, ఏసిపిలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఇన్స్సె్పక్టర్ షూకూర్, ఆర్.ఎస్.ఐ శరత్, మణికృష్ణ పాల్గోన్నారు.