14 July, 2026 | 6:54 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్

06-01-2026 12:04 AM

ముకరంపుర, జనవరి 5 (విజయ క్రాంతి): టీఎన్జీవో జిల్లా, పట్టణ శాఖల ఆధ్వర్యంలో ముద్రించిన టీఎన్జీవోల క్యాలెండర్2026ను  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, నాలుగో తరగతి ఉద్యోగులు సహా ఉద్యోగ వర్గాలన్నిటికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో ఉద్యోగులు మరింత నిబద్ధతతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సంఘము లక్ష్మణరావు, టిజీఓల అధ్యక్ష, కార్యదర్శులు మడిపల్లి కాళీ చరణ్, అరవింద్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, సర్దార్ హరేమేందర్ సింగ్, హరికృష్ణ, గూడ ప్రభాకర్ రెడ్డి, సందీప్ రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగార రమేష్, పోలు కిషన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.