జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
10-03-2026 02:08 AM
మెదక్, మార్చి 9 (విజయక్రాంతి): సోమవారం జిల్లా న్యాయమూర్తి నీలిమను వారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మర్యాదపూర్వకంగా మొక్క అందించి కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, న్యాయ పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు. జిల్లాలో ప్రజలకు వేగవంతమైన న్యాయ సేవలు అందించేందుకు పరిపాలన ,న్యాయ వ్యవస్థ పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. అలాగే జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యల గురించి జి ల్లా కలెక్టర్ వివరించారు.




