7 March, 2026 | 6:37 PM

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి

07-03-2026 03:15 PM

జిల్లా కలెక్టర్ కే. హైమావతి

చేర్యాల: చేర్యాల మున్సిపల్ పరిధిలోని సుందరయ్య నగర్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను శనివారం జిల్లా కలెక్టర్ కె.హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా గెలిచిన స్థానిక నాయకులకు ప్రజలలో మంచి పేరు సుస్థిరం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, మార్చి 6 నుంచి మార్చి 12 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని  తెలిపారు.

అధికారులు,కౌన్సిలర్ లకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పారిశుధ్య  సంబంధించి చేయాల్సిన పనులు మున్సిపల్ కమిషనర్ మరియు చైర్ పర్సన్ దృష్టికి తీసుకొని వస్తె వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. మున్సిపల్ పరిధిలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చెయ్యాలని,ఏ ఫైల్ తిరస్కరించిన స్పష్టమైన కారణం తెలియజేయాలని కమిషనర్ ను ఆదేశించారు. 99 రోజుల కార్యక్రమంలో చివరి వరకు ప్రజా ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గోన్నాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కొమ్ము రాజేశ్వరి,మున్సిపల్ కమిషనర్ నాగేందర్,సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.