20 June, 2026 | 8:55 PM

Breaking News

పచ్చి పులుసు లాగా చెయ్యకూడదు

20-06-2026 07:47 PM

- సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి 

కొండపాక: కొండపాక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మితంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ అన్నం, పప్పు, బెండకాయ, సాంబారు, రసం, గుడ్డు లను పరిశీలిస్తూ రసం నాణ్యతను మెరుగుపరచాలని పచ్చిపులుసులాగా చేయకూడదని వంట సిబ్బందిని హెచ్చరించారు.

వంటగది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోజు కామన్ డైట్ మెనూ పాటిస్తూ వంట రుచికరంగా పెట్టాలని, విద్యార్థులకు చదువుతోపాటు భోజనం, వసతిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఎస్ ఓ ను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో మోను పాటిస్తూ విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఎస్ ఓ తదితరులు ఉన్నారు.