20 June, 2026 | 8:29 PM

Breaking News

సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •   రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు   •   లోక్ అదాలత్ రాజీమార్గంలో ఇద్దరు గెలుస్తారు   •  

రూ.20 లక్షల సుడా నిధులతో యుజిడి పనులకు శంకుస్థాపన

20-06-2026 07:49 PM

కరీంనగర్,(విజయక్రాంతి): నగరంలోని 53వ డివిజన్ శర్మనగర్ లో సుడా నిధులు 20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ లు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగుతామని అంతర్గత రోడ్లు డ్రైనేజీలకు నిధులు వెచ్చించి ఎక్కడికక్కడ పనులను వేగవంతం చేయడం జరుగుతుందని అన్నారు. ఇంకా చాలా ప్రాంతాలలో చేయాల్సి ఉందని సాధ్యమైనంత వరకు పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నామని పేర్కొన్నారు.