15 May, 2026 | 11:38 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

గోవింద్‌పేట్ పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

13-03-2026 12:05 AM

నిజామాబాద్, మార్చి 12 (విజయ క్రాంతి) : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ లో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు.

బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ, మధుమేహం, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కాగా, పీ.హెచ్.సీలో గురువారం రోజున ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్, ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరానికి హాజరయ్యారా అని ఆరా తీశారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.