ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
06-08-2026 01:15 AM
ఖమ్మం, ఆగస్టు 5 (విజయక్రాంతి): సమీకృత జిల్లా కలెక్టరేట్ లోనీ ఈ.వి.ఎం. గోడౌన్ ను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. నెలవారి తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసి గోడౌన్ రూం సీల్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించి తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేసి భద్రతా సిబ్బంది షిఫ్టుల వారీగా చేస్తున్న డ్యూటీలో ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, భద్రతా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పరాస్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజు, డిటి అన్సారీ, ఆర్ అండ్ బి, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.






