6 August, 2026 | 2:33 AM

గుర్రంగూడెం రహదారి బాగుచేయాలని రైతుల నిరసన

06-08-2026 01:16 AM

చండ్రుగొండ, ఆగస్టు 5, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం, గుర్రంగూడెం గ్రామానికి వెళ్లే రహదారిపై పడ్డ గుంతలను పూడ్చాలని, రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని, రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద ఏర్పడ్డ గుంతలను పూడ్చలని, నీళ్లు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం రోడ్డుపై బురదనీటిలో నిలబడి రైతులు, గ్రామస్తులు తమ నిరసనని తెలియజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..... రోడ్డు రెండేండ్లుగా అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ పట్టించుకోవడం లేదన్నారు.

ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పట్టించుకోవటం లేదన్నారు. రోడ్డుపై బడికి వెళ్లాలంటే చిన్నారులు, విద్యార్ధులు అవస్థలు పడుతున్నారన్నారు. వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు సైతం గురవ్వటం జరిగిందన్నారు. రైతులు తమ పంట చేనులకు మందులను తీసుకెళ్లలేక నెత్తిపై పెట్టుకొని మోస్తున్నారన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో చండ్రుగొండజాతీయ రహదారిపై ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.