డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రాఘవేందర్ రెడ్డి చొరవ

06-08-2026 | 01:14am

బడంగ్పేట్ సర్కిల్, ఆగష్టు 5 (విజయక్రాంతి)వినాయక హిల్స్ కాలనీ ఫేజ్1, 2, 3 కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై స్థానిక ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను వెంటనే స్పందించిన బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారు, బడంగ్ పేట్ సర్కిల్ -16, డీఈ హరిణి గారితో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. అనంతరం ఆమెను వెంటనే సమస్య ఉన్న కాలనీకి క్షేత్రస్థాయిలో పరిశీలనకు తీసుకువచ్చి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేలా చేసారు.

పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం, సంబంధిత మున్సిపల్ సిబ్బందిని తక్షణమే అక్కడికి రప్పించి డ్రైనేజీ సమస్య పరిష్కార పనులను ఆలస్యం లేకుండా ప్రారంభించేలా చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పరిష్కారం కల్పించే దిశగా కృషి చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తూ, సమస్యలను గుర్తించడం మాత్రమే కాకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారితో పాటు ఎదుళ్ల ప్రతాప్ రెడ్డి, వినోద్ నాయక్, రంజిత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొని సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందించారు.

మరిన్ని వార్తలు