పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
14-03-2026 02:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో శనివారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ బైంసా ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాయడానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన తనిఖీలు నిర్వహించి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటుపై అడిగి తెలుసుకున్నారు




