11 April, 2026 | 9:47 PM

Breaking News

మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •   ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు   •   గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి   •  

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం

11-04-2026 08:01 PM

జీజీహెచ్ లో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వారోత్సవాల్లో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి శనివారం ప్రారంభించారు. అలాగే డెడికేటెడ్ సెమీ ఐసీయూ వార్డును ప్రారంభించి.. అక్కడ అందించే సేవలపై ఆరా తీశారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో ప్రారంభించామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డ్రగ్స్ తో కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

కోర్టు నిర్మాణ పనుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన పనులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతి పై ఆరా తీసి.. ఆర్ అండ్ బీ అధికారులకు పలు సూచనలు చేశారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, ఆర్ ఎంఓ డాక్టర్ సంతోష్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.