calender_icon.png 9 February, 2026 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకం

09-02-2026 06:26:34 PM

జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ 

మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు  అంగన్వాడి స్కూలును సందర్శించి పిల్లలతో  మాట్లాడి చదువు పౌష్టికాహారం వివరాలు అడిగి తెలుసుకొని అక్షరాలు, సంఖ్యలు చెప్పిస్తూ ప్రోత్సహించారు. ఈ సందర్భంగా  అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు పోషణాహార వివరాలు దైనందిన హాజరు పరిస్థితి తదితర అంశాలపై అక్కడ ఉన్న అంగన్వాడి ఆయాలతో వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య ఎంతో కీలకమని వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఏం తిన్నారు? ఏం పెట్టారు? అని అడిగారు. దానికి పిల్లలు సమాధానం  చెప్తూ పప్పు పెట్టారని చెప్పారు. ఏ ఫర్ ఆపిల్  బి ఫర్ బాల్  సిఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ అని 1 నుండి 20 వరకు అంకెలు అడిగారు ఈ కార్యక్రమంలో మర్రిగూడ తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో మున్నయ్య  సిపిడిఓ సక్కుబాయి మునుగోడు సిడిపీవో అంగన్వాడి టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు