28 April, 2026 | 7:47 AM

ఆమనగల్లులో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

28-04-2026 01:36 AM

ఆమనగల్లు, ఏప్రిల్ 27 (విజయక్రాంతి):ఆమనగల్లు మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాల లో  భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పోనుగోటి అర్జున్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, కార్యకర్తలకు మరియు ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల్లో కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, నాగిళ్ల జగన్, ఎంగలి భాగ్యలక్ష్మి, పుల్లారెడ్డి అనూషలతో పాటు దుడ్డు ఆంజనేయులు, యనమల్ల రమేష్ పాల్గొన్నారు. అలాగే పార్టీ సీనియర్ నాయకులు సైదులు గౌడ్, ఖలీల్, గుత్తి బాలస్వామి, ఎంగలి రఘు, కోట శ్రీను, గుజ్జరి గోపి, శ్రీను నాయక్, పుల్లారెడ్డి శ్రీశైలం మరియు ఇతర కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.