2 May, 2026 | 9:21 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

వాయు నాణ్యత పెంపునకు సమష్టి కృషి

23-01-2026 12:22 AM

అదనపు కమిషనర్ రఘు ప్రసాద్

హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 22 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం అమలును వేగవంతం చేసే చర్యల్లో భాగం గా సిటీ లెవల్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆయన నగరంలో గాలి కాలుష్య నియంత్రణకు సంబం ధించి వివిధ విభాగాల పనితీరును కూలం కషంగా సమీక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యత పరిస్థితులను, కాలుష్య హాట్స్పాట్లను అత్యధిక కాలుష్యం ఉన్న ప్రాంతాలు అధికారులు విశ్లేషించారు. స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్డబ్ల్యూఎం  విభాగం అధికారులు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ టెక్నికల్ కన్సల్టెంట్ సుధాకర్ డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.