7 May, 2026 | 5:28 PM

బాల్య వివాహాల నిర్మూలనకు సమష్టి కృషి

07-05-2026 04:41 PM

డీఆర్‌డీఓ దత్తరావు

వాంకిడి,(విజయక్రాంతి): బాలికల రక్షణ, విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కుమ్రం భీం జిల్లా డీఆర్‌డీఓ దత్తరావు పిలుపునిచ్చారు. వాంకిడి మండలం ఖమానలో గురువారం కిషోర బాలికల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు.మే 2 నుంచి 10 వరకు సమ్మర్ క్యాలెండర్ కార్యక్రమాల ద్వారా గ్రామీణ బాలికల్లో చైతన్యం తెస్తున్నామని ఆయన తెలిపారు.

బాల్య వివాహాల నివారణపై ప్రతి కుటుంబం బాధ్యత వహించాలన్నారు. బాలికల ఆరోగ్యం, ఉన్నత విద్య, ఆర్థిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం, సైబర్ భద్రతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.బాలికలను చదివించి స్వయం సమర్థులుగా తీర్చిదిద్దితేనే సమాజాభివృద్ధి సాధ్యమని చెప్పారు. గ్రామ స్థాయిలో మహిళా సంఘాలు, అధికారులు సమన్వయంతో బాలికల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీపీఎంలు రామకృష్ణ, యాదగిరి, ఏపీఎం ధనరాజ్, శారద, రాణి, వీఓ అధ్యక్షురాలు రేణుక, సీసీలు భీంరావు, రమేష్, వీవోఎస్ లు ఆనంద్‌రావు, బాబురావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.