10 May, 2026 | 5:47 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం.. పాల్గొననున్న సీఎం

05-09-2025 10:18 AM

ఉపాధ్యాయ దినోత్సవం.. నేడు అవార్డుల ప్రదానం చేయనున్న సీఎం

హైదరాబాద్: తరగతి గదుల్లో దేశ భవితను తీర్చిదిద్దే మార్గదర్శకులు, సమాజానికి జ్ఞానాన్ని పంచుతున్న గురువులందరికీ.. భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతి(Sarvepalli Radhakrishnan birth anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేడు శిల్పకళా వేదికలో టీచర్స్‌ డే(Teachers Day) కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సీఎం అవార్డులు ప్రదానం చేయనున్నారు. జీహెచ్ఎంసీ కేటగిరీలో జెడ్పీహెచ్ఎస్ బోర్గోన్ పాఠశాల హెడ్ మాస్టర్ సీహెచ్ శంకర్ ఎంపికయ్యారు. పాఠశాలస్థాయిలో 7 కేటగిరిలో ఉపాధ్యాయులకు అవార్డులు వరించనున్నాయి. పాఠశాల విద్యాశాఖలో 57 మందికి ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఇంటర్ విద్యలో 11 మందికి అవార్డులు ప్రకటించింది. వివిధ యూనివర్సిటీల్లో 60 మందికి తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది.