1 April, 2026 | 5:17 PM

ప్రధాని మోదీ, పినరయి విజయన్ కు తేడా లేదు

01-04-2026 03:49 PM

ముట్టతార రోడ్ షోలో సీఎం రేవంత్

కేరళం ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం

తిరువనంతపురం: కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ముట్టతార (Muttathara) రోడ్ షోలో పాల్గొన్నాను. ప్రధాని మోదీ, పినరయి విజయ్ కు తేడా ఏమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యావంతులని కొనియాడారు. మతతత్వ శక్తులు కేరళంలోకి ప్రవేశించకుండా నియంత్రించాలని ఆ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మతతత్వ శక్తులు రాకుండా ఇక్కడి ప్రజలు లక్ష్మణ రేఖ గీశారని సీఎం తెలిపారు. కేరళంకు భవిష్యత్తు లేకుమా చేయాలని మోదీ, పినరయి చూస్తున్నారని ఆరోపించారు. పెట్టుబడులు తెచ్చి కేరళంను అభివృద్ధి చేసేవారికే ఓటు వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

కేరళ శాసనసభకు(Kerala Legislative Assembly) చెందిన 140 మంది సభ్యులను ఎన్నుకోవడానికి, 2026 కేరళ శాసనసభ ఎన్నికలు 2026 ఏప్రిల్ 9న కేరళలో జరగనున్నాయి. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. కేరళ శాసనసభ పదవీకాలం మే 23, 2026న ముగియనుంది. గత శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 2021లో జరిగాయి. ఈ ఎన్నికల్లో శాసనసభలోని 140 స్థానాలకు గాను 99 స్థానాలను గెలుచుకోవడంతో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని 'లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్' తిరిగి కేరళంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పినరయి విజయన్(Pinarayi Vijayan) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2026 ఎన్నికల్లో పినరయి విజయన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.