2 April, 2026 | 2:06 AM

బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణి దాడి

02-04-2026 12:17 AM
  1. బటెల్కోలోని అమెజాన్ డేటా సెంటర్ లక్ష్యంగా ఐఆర్‌జీసీ బాంబులు
  2. అమెజాన్ డేటా సెంటర్‌లో భారీ మంటలు
  3. బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో 
  4. హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం!
  5. ఈ దాడుల్లో 10 మంది మృతి, మరో 20 మందికి గాయాలు
  6. ఇజ్రాయెల్‌పై మూడోసారి హైతీల క్షిపణిదాడి

  7. మనామా/బీరుట్/టెహ్రాన్, ఏప్రిల్ 1: అమెరికా ఇరాన్ మధ్య యు ద్ధం రోజురోజుకూ భీకరంగా మారుతోంది. మధ్య ఆసియాలో అమెరికన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ అనుకున్నంత పనిచేసింది. బహ్రెయిన్‌లోని బటెల్కో ప్రధాన కార్యాలయంపై బుధవారం క్షిపణి దాడిచేసింది. దీంతో అందులో భారీ మంటలు చెలరేగాయి. మరోపక్క లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులతో విరుచుకుపడింది.

ఈ దాడుల్లో హిజ్బుల్లా టాప్ కమాండర్ యూసుఫ్ ఇస్మాయిల్ హషీమ్ మృతి చెందాడని ఐడీఎఫ్ ప్రకటించింది. రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో కనీసం 10మంది మృతిచెందారు. మరో 20 మందికి గాయాలైనట్లు సమాచారం. ఇంకోపక్క ఇజ్రాయెల్‌పై ఇరాన్, లెబనాన్‌తో కలిసి ఏకకాలంలో మూడోసారి మిస్సైల్స్‌తో ఢీకొట్టామని యెమెన్ సాయుధ దళాలు (హౌతీ లు) ప్రకటించారు. బహ్రెయిన్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్వహిస్తున్న అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థలో బటెల్కో ఒకటి కావడం చర్చనీయాంశంగా మారింది. ఇరా న్ క్షిపణి దాడుల వల్ల బెహ్రెయిన్‌లోని కీలకమైన టెలికమ్యూనికేషన్ హబ్‌లో మంటల చెలరేగి భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. బటెల్కో బెహ్రెయిన్ జాతీయ మౌలిక సదుపాయాలలో అతిప్రధానమైనది. కొనసా గుతున్న అమెరికా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగింది.

  అయితే బహ్రెయిన్ అధికారులు గానీ, బటెల్కో యాజమాన్యం గానీ, అమెజాన్ వెబ్ సర్వీస్(ఏడబ్ల్యూస్) నుంచి గానీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లినట్లు అధికారికంగా వెల్లడించలేదు. పశ్చిమాసియాలో అమెరికాతో సంబంధం ఉన్న టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరా న్ ఇటీవల అనేక సార్లు హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధంలో భాగం గా ఇప్పటికే బెహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈతో సహా అనేక గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడుతున్న విషయం తెలిందే. 

బీరుట్‌పై ఇజ్రాయెల్ క్షిపణుల దాడి

అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం భీకరంగా  కొనసాగుతోంది. లెబనాన్ అంతటా విస్తృత వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. మంగళవారం రాత్రిపూట జరిగిన బాంబు దాడుల్లో లెబనాన్ రాజధాని బీరుట్‌లోని జ్నా ప్రాంతంపై పలు క్షిపణులు పడటంతో కనీసం 10 మంది మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడు లు జ్నాలో పార్క్ చేసి ఉన్న అనేక కార్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ మేరకు బీరుట్‌లో రాత్రిపూట రెండు దాడు లు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.

‘రాత్రి సమయంలో, ఐడీఎఫ్ బీరుట్‌లో రెండు దాడు లు చేసింది. ఒకటి హిజ్బుల్లాకు చెందిన ఒక సీనియర్ ఉగ్రవాద నాయకుడిని లక్ష్యంగా చేసుకోగా, మరొకటి మరో సీనియర్ ఉగ్రవాద నాయకుడిని లక్ష్యంగా చేసుకుందని ఐడీఎఫ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడులు బీరుట్‌ను కుదిపేశాయ ని, ప్రధానంగా హిజ్బుల్లా కాన్వాయ్‌పై దాడి జరిగింద ని, పలు క్షిపణి దాడుల్లో కనీసం 11 మంది మరణించారని ఇజ్రాయెల్‌కు అనుబంధంగా ఉన్న కొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి.

ఈ దాడులకు ఒక రోజు ముందు కూడా ఐడీఎఫ్ బీరుట్ విమానాశ్రయం సమీపంలోని ఒక భవనంపై భారీ దాడి చేసింది. దీంతో బహుళ అంతస్తుల భవనం ధ్వంసమైంది. హిజ్బుల్లాతో జరిగిన భీకర కాల్పుల పోరాటంలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ నేపథ్యం లో, గత 24గంటల్లో ఇ జ్రాయెల్ లెబనాన్‌పై తన దాడులను ఉధృ తం చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెబనాన్‌లో సుమారు 1,200 మంది మరణించారు. 12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని లెబనీస్ అధికారులు వెల్లడించారు. 

హిజ్బుల్లా టాప్ కమాండర్ హతం!

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ఉధృతంగా విజృంభిస్తోంది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన భీకర దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడిలో హిజ్బుల్లా దక్షిణ విభాగానికి మాస్టర్‌మైండ్‌గా భావించే టాప్ కమాండర్ యూసుఫ్ ఇస్మాయిల్ హషీమ్ హతమయ్యాడు. దక్షిణ లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్ భూభాగంపై జరిగే అనేక దాడులకు ఇతనే ప్రధానవ్యూహకర్త అని ఇజ్రాయె ల్ రక్షణదళం ధ్రువీకరించింది.

ఇజ్రాయెల్‌పై హైతీల క్షిపణిదాడి

ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకుని ‘మూడో సంయుక్త క్షిపణి దాడి’ చేసినట్లు హౌతీలు ప్రకటించారు. ఆక్రమిత పాలస్తీనాకు దక్షిణాన ఉన్న ‘సున్నితమైన ప్రదేశాలను ‘లక్ష్యంగా చేసుకుని, ఇరాన్, లెబనాన్‌లోని మిత్ర బృందాలతో సమన్వయంతో తమ ‘మూడో సంయుక్త దాడి‘ని నిర్వహించినట్లు యెమెన్ సాయుధ దళాలు ప్రకటించాయి.

ఆక్రమిత పాలస్తీనాకు దక్షిణాన ఉన్న ‘సున్నితమైన ప్రదేశాలను‘ లక్ష్యంగా చేసుకుని, ఇరాన్, లెబనాన్‌లోని మిత్ర బృందాలతో సమన్వయంతో తమ ‘మూడో సంయుక్త దాడి‘ని నిర్వహించినట్లు యెమెన్ సాయుధ దళాలు పేర్కొన్నాయి. ఈ మేరకు సోషల్‌మీడియా ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాయి. యెమెన్ సాయుధ దళాల అధికార ప్రతినిధి యాహ్యా సరీ, ఈ దాడిలో ఇరాన్‌లోని ‘సోదర ముజాహిదీన్’, హిజ్బుల్లా సహకారం ఉందని తెలిపారు.

‘ఆక్రమిత పాలస్తీనాకు దక్షిణాన ఉన్న ఇజ్రాయెల్‌లోని సున్నితమైన ప్రదేశాలపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించినట్లు పేర్కొన్నారు. ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన ప్రకారం.. ఈ తాజా దాడిని ప్రతిఘటన వర్గాలకు మద్దతుగా నిర్వహించినట్లు, ఇది తమ మూడో సమన్వయ దాడి అని యెమెన్ సాయుధ దళాలు తెలిపాయి. ఈ మిషన్ ‘ఇరాన్, హిజ్బుల్లా సహకారంతో నిర్వహించామని, ఇది విజయవంతమైందని ఆ బృందం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ప్రకారం, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగం జరిగిందని బుధవారం ఐడీఎఫ్ పేర్కొంది.