2 May, 2026 | 6:55 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

30-10-2025 09:16 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించనున్నారు. మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేవంత్ రెడ్డి పరిస్థితులపై సమీక్షించనున్నారు. మొంథా తుపాన్(Cyclone Montha) ప్రభావంపై ముఖ్యమంత్రి బుధవారం నాడు అధికారులను ఆరా తీశారు. మొంథా తుఫాను కారణంగా సంభవించిన భారీ వర్షాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశువుల నష్టాన్ని నివారించడానికి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని, ముఖ్యంగా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని ఆదేశించారు.