ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదు: సీఎం రేవంత్ రెడ్డి
మోదీ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్
కేంద్రంతో కలిసి నడుస్తాం
ప్రధాని మోదీ పిలుపులో రాజకీయాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమంలో నిన్న పాల్గొన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం నాడు నిర్వహించిన మీడియాతో చిట్ చాట్ లో పేర్కొన్నారు. తమతో కలిసి రావాలన్న ప్రధాని పిలుపును స్వాగతిస్తున్నట్లు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణ రాజకీయాలపై మరిన్ని వార్తలు చదవండి
వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామని వెల్లడించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని సూచించారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. మా పార్టీలు, ఐడీయాలజీ వేరైనా.. అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఎన్నోసార్లు కలిసినా.. కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. రెండు గంటలు సమయమిస్తే తమ ప్రణాళికను ప్రధానికి వివరిస్తామని తెలిపారు. మెట్రోపాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వార్తల కోసం ఇక్కడ విజయక్రాంతి న్యూస్‌ను క్లిక్ చేయండి






