21 June, 2026 | 11:16 PM

ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళి

21-06-2026 01:42 PM

హైదరాబాద్: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక, ఉద్యమానికి సిద్ధాంతకర్త, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. పదవులు, ప్రలోభాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తన జీవిత లక్ష్యంగా మలుచుకున్న మహోన్నత వ్యక్తిత్వం ఆచార్య జయశంకర్ గారిదని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. వారి ఆలోచనలు, త్యాగం, నిబద్ధత నేటికీ తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆచార్య జయశంకర్ సార్ కలలు కన్న సమానత్వం, అభివృద్ధి, ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం మనమంతా కృషి చేయడమే వారికి నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.