22 June, 2026 | 12:17 AM

షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

21-06-2026 01:34 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): దహెగాం మండలం రాళ్లగూడ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో రైతు రోహీనే రఘుకు నష్టం వాటిల్లింది.గ్రామానికి చెందిన రైతు రోహీనే రఘు ఇంట్లో విద్యుత్ వైర్లు షార్ట్‌సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నిల్వ ఉంచిన వరిగడ్డి కుప్పలపై మంటలు పడటంతో అవి వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి వరిగడ్డి కుప్పలు, యూరియా బస్తాలు, గుమ్మిలో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా దగ్ధమయ్యాయి.మంటలు మరింత విస్తరించడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.అగ్నిప్రమాదంలో సుమారు రూ.1 లక్ష మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు రోహీనే రఘు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆయన కోరారు.