23 July, 2026 | 4:08 PM

గ్లోబరినా అంశంపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: సీఎం డిమాండ్

23-07-2026 03:19 PM

గ్లోబరీనా విషయంలో కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలి

హైదరాబాద్: ఓటు ప్రక్షాళన ముఖ్యమని పార్టీ నాయకులకు గట్టిగా చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గురువారం నిర్వహించిన మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు. ఇప్పటివరకు 70 శాతం ఎస్ఐఆర్ పూర్తి అయిందని, మరో 30 శాతం చేయాల్సి ఉందన్నారు. చిన్న చిన్న తేడాలు ఉన్న ఓటరు సవరణ కాదని సూచించారు. నాకు రెండు ఓట్లు ఉన్నట్లు ఫిర్యాదు ఇవ్వమనండి.. తప్పుడు ఫిర్యాదు అయితే లోపల వేయిస్తానని సీఎం రేవంత్ హెచ్చరించారు. నా ఓటును బదిలీ చేయించుకున్నా.. కలెక్టర్ కు దరఖాస్తు చేసి బదిలీ చేయించుకున్నట్లు తెలిపారు. గతంలో కర్ణాటకలో కొడంగల్ ఉందన్న సీఎం రేవంత్ భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలంగాణలోకి వచ్చిందని సూచించారు.

బీఎల్ వోలకు అనుసంధానంగా పార్టీ ఓట్లు పోకుండా చూస్తున్నారని తెలిపారు. ఎస్ఐఆర్ పై అవగాహనారాహిత్యం వల్లే బీఎల్ఏలను పెట్టినట్లు పేర్కొన్నారు. బీఎల్ఏలు పరిశీలన చేసి ఓట్లు పోకుండా చూస్తారని సూచించారు. ఓట్లు లేకుంటే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు. ప్రక్షాళన పేరుతో ఓట్లను తొలగించే అవకాశముందని వెల్లడించారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ఓట్లన్నీ తొలగించారని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ కోర్టుకెళితే నాటి జీహెచ్ఎంసీ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. హైడ్రా బాగా పని చేస్తోందని కొనియాడిన ముఖ్యమంత్రి చాలా ఆస్తులు స్వాధీనం చేసుకుందన్నారు.

కాళేశ్వరంలో ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని చమత్కరించారు. కాళేశ్వరంలో దండుకోవడంతో  వాళ్ల మామ మంత్రి పదవి నుంచి పక్కపెట్టారని ఆరోపించారు. పదేళ్లు దోచుకున్న వాళ్లు ఎవరూ రక్తం ఇవ్వలేదని  విమర్శించారు. ఆ రక్తం ఎవరికి అమ్ముకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా విషయంలో కేటీఆర్ నిజాయితీ నిరూపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ట్రంప్ పెట్టుబడులు పెట్టారు.. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టినందున రోడ్డుకు ట్రంప్ పేరుకు అనుమతి ఇచ్చామన్నారు. కాళేశ్వరంపై సీబీఐని బీఆర్ఎస్‌ పార్టీ మేనేజ్‌ చేసిందని సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.