బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
బీఆర్‌ఎస్ నేత నడికోప్పు నాగరాజు ముదిరాజ్
మేడ్చల్ అర్బన్ మే 20 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ 298వ డివిజన్ కు చెందిన నాచారం మహేష్ యాదవ్ కుమారుడు కౌశిక్ కు 30 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా తండ్రికి అందజేయడం జరిగిందని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నడికొప్పు నాగరాజు ముదిరాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఆరోగ్య సమస్యల పట్ల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడు తుందని తెలిపారు. అనంతరం మహేష్ యాదవ్ మాట్లాడుతూ తన కుమారునికి వైద్య చికిత్సల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరి చేయాలని కోరగా వెంటనే మంజూరి చేయించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నడికొప్పు నాగరాజుకు,మాజీమంత్రి ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.






